ఆర్టీసీ బస్సు..ఇన్నోవా ఢీకొని.. ఐపీఎస్ ఆఫీసర్, కాంట్రాక్టర్ మృతి

ఆర్టీసీ బస్సు..ఇన్నోవా ఢీకొని.. ఐపీఎస్ ఆఫీసర్, కాంట్రాక్టర్ మృతి
  • నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట వద్ద ప్రమాదం

అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐపీఎస్ ఆఫీసర్, కాంట్రాక్టర్​చనిపోయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి సుధాకర్ భానుదాసు పతారే(54), కాంట్రాక్టర్​భాగవత్ కిషన్ రావ్ ఖోడ్కే పాటిల్(66)తో పాటు మరికొందరు ఇన్నోవా కారులో శనివారం శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నారు.  దోమలపెంట సమీపంలో హైదరాబాద్ కు వెళ్తున్న పికెట్ డిపో బస్సు, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఐపీఎస్​ ఆఫీసర్ తో పాటు కాంట్రాక్టర్  తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి, అక్కడినుంచి మెరుగైన చికిత్సకు వెల్దండ మండలంలోని యెన్నం హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. డెడ్​బాడీలకు కల్వకుర్తి ఆస్పత్రిలో పోస్ట్​మార్టం చేసి బంధువులకు అప్పగించారు. నాగర్​కర్నూల్​ఎస్పీ గైక్వాడ్​ వైభవ్​రఘునాథ్  కల్వకుర్తి ఆస్పత్రికి వెళ్లి మృతుల బంధువులను పరామర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్​నాయక్​ తెలిపారు.